మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 17:51:18

యువ‌కుడిని ట్రీట్ అడిగిన సోనూ సూద్‌!

యువ‌కుడిని ట్రీట్ అడిగిన సోనూ సూద్‌!

అడ‌గందే అమ్మ అయినా పెట్ట‌దంటారు. కానీ అడ‌గ‌కుండానే అంద‌రికీ సాయం అందించాడు బాలీవుడ్ హీరో సోనూ సూద్‌. ఆయ‌న సేవ‌ల‌కు సినీ ఇండ‌స్ట్రీ, రాజ‌కీయ నాయ‌కులు సైతం ఫిదా అయ్యారు. అంతేకాదు ప్రపంచ ప్రసిద్ధి ఐక్యరాజ్యసమితి చేత గొప్ప మానవతావాదిగా  సత్కారం కూడా పొందాడు. ఇలాంటి అవార్డును ఇప్పటివరకు అతి కొద్దిమంది హాలీవుడ్ స్టార్స్ మాత్రమే పొంద‌డం గ‌మ‌నార్హం. రీల్ లైఫ్‌లో విల‌న్‌గా ముద్ర వేసుకున్నా రియల్ లైఫ్‌లో నిజ‌మైన హీరోగా అంద‌రి హృద‌యాల్లో నిలిచాడు సోనూ సూద్‌. ఇత‌ని సాయం పొందిన ప్ర‌తిఒక్క‌రూ సోష‌ల్ మీడియా ద్వారా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు.

ఉపాధి లేని వారికి సొంతంగా బిజినెస్ పెట్టించాడు. సోనూ సూద్‌ను ఆద‌ర్శంగా తీసుకొని హైద‌రాబాద్‌కు చెందిన అనిల్ కుమార్ త‌న స్టాల్‌కు ఉన్న పేరును తొలిగించి సోనూ సూద్‌గా మార్చుకున్నాడు. ‌స్టాల్‌కు సంబంధించిన ఫోటోల‌ను ట్విట‌ర్‌లో సోనూసూద్‌కు ట్యాగ్ చేశాడు. దీనికి 'నాకు అక్కడ ట్రీట్ దొరుకుతుందా?' అని సోనూ రీట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌రంగా మారింది. 


logo