శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 15:01:58

నా ఫోను ఫ్రీగా రీచార్జ్ చేస్తారా.. సోనూసూద్ ప్ర‌శ్న‌

నా ఫోను ఫ్రీగా రీచార్జ్ చేస్తారా.. సోనూసూద్ ప్ర‌శ్న‌

ఆప‌త్కాకాలంలో ఆప‌ద్భాంద‌వుడిగా నిలిచి అందరిచే జేజేలు ప‌లికించుకుంటున్న బాలీవుడ్ న‌టుడు సోనూసూద్. చేతికి ఎముక లేద‌న్న‌ట్టు ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సోనూసూద్ సోష‌ల్ మీడియా ద్వారా కూడా స‌మ‌స్య‌ల‌కు స్పందిస్తూ ఉంటారు. ఒక్కో సారి నెటిజ‌న్స్ కామెంట్స్ కు స‌ర‌దాగా కూడా స్పందిస్తారు.

ఓ మొబైల్ య‌జ‌మాని త‌న షాపుకు సోనూసూద్ పేరు పెట్టి ఆ కటౌట్‌లో ఈ నటుడి ఫోటో కూడా చేర్చాడు. ఇది చూసిన నెటిజ‌న్ ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ సోనూకి ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన సోనూసూద్ .. నా మొబైల్ ఫ్రీగా రీచార్జ్ చేస్తారా అంటూ స‌ర‌దాగా కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట్ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.