గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 08:26:21

మ‌రో చిన్నారికి గుండె ఆప‌రేష‌న్ చేయించిన సోనూసూద్

మ‌రో చిన్నారికి గుండె ఆప‌రేష‌న్ చేయించిన సోనూసూద్

అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ వెళుతున్న సోనూసూద్ ప్ర‌జ‌ల గుండెల‌లో దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు. క‌డుపు కాలుతున్న వారికి ఆక‌లి తీరుస్తూ, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి వైద్యం అందిస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నాడు. సోనూ సేవ‌ల‌కు ఫిదా అవుతున్న ప్ర‌జ‌లు ఆయ‌న‌కు గుడులు క‌ట్టి మరీ పూజ‌లు చేస్తున్నారు. లాక్ డౌన్ స‌మయంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సోనూసూద్ త‌ర్వాత కూడా వాటిని కొన‌సాగిస్తున్నాడు.

తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆయన సాయం చేశారు సోనుసూద్. పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి కూలీల ఎనిమిది నెలల కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమ‌త కూడా లేక‌పోవ‌డంతో సోనూసూద్ ట్ర‌స్ట్‌ను సంప్ర‌దించారు. వారి క‌ష్టాన్ని అర్దం చేసుకున్న సోనూసూద్   బాలుడిని ముంబైలోని  నారాయణ హృదాలయ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. బాలుడికి గుండె ఆపరేషన్‌ కు అయ్యే ఖర్చును అంతా తానే భరించారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌తి ఒక్క‌రు సోనూసూద్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

VIDEOS

logo