శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 13, 2020 , 15:12:36

మా కుటుంబంలోకి మీకు స్వాగతం రానా: సోన‌మ్ క‌పూర్

మా కుటుంబంలోకి మీకు స్వాగతం రానా:  సోన‌మ్ క‌పూర్

ద‌గ్గుబాటి రానా త‌న పెళ్ళికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసాడో లేదో ఇటు అభిమానులు అటు సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిసింది. మెగాస్టార్ చిరంజీవి.. చివరికి భళ్లాల దేవుడు అంతటి ధీశాలి కూడా ప్రేయసి వలలో చిక్కుకున్నాడు అంటూ ఫన్నీ ట్వీట్ చేసి ఇద్ద‌రికి ఆశీర్వాదాలు అందించారు. ఇక ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి సోన‌మ్ క‌పూర్ కూడా రానా ప్ర‌క‌ట‌నపై స్పందించింది.

డార్లింగ్ బేబీ మిహీక‌.. నీకు నా శుభాకాంక్ష‌లు. ఐ ల‌వ్ యూ డాల్‌. నీకు స‌రిజోడిని ఎంపిక చేసుకున్నావు. నిన్ను సంతోషంగా చూసుకుంటాడు. ల‌వ్ యూ బోత్‌.. మా కుటుంబంలోకి నీకు స్వాగ‌తం రానా అంటూ సోన‌మ్ క‌పూర్ త‌న పోస్ట్‌లో తెలిపింది. మిహీకా..సోన‌మ్ క్లోజ్ ఫ్రెండ్ కాగా, వారి స్నేహ బృందంలోకి ఇప్పుడు రానా కూడా చేరిపోయాడు. డ్యూ డ్రాప్‌ పేరిట ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్వ‌హిస్తున్న మిహీకాకి బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. ముఖ్యంగా సోన‌మ్‌తో మంచి రిలేష‌న్‌లో ఉన్న మిహీకా ఈ బాలీవుడ్ దివాకి సంబంధించిన అన్ని ఫంక్షన్స్‌లోను సంద‌డి చేస్తుంది. సోన‌మ్, మిహీకాకి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. logo