గురువారం 04 జూన్ 2020
Cinema - May 12, 2020 , 09:18:22

అంద‌మైన ఇంటి ఫోటోలు షేర్ చేసిన సోన‌మ్ క‌పూర్

అంద‌మైన ఇంటి ఫోటోలు షేర్ చేసిన సోన‌మ్ క‌పూర్

బాలీవుడ్ బ్యూటీ సోన‌మ్ క‌పూర్ ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే ప‌రిమిత‌మైంది. ఢిల్లీలో త‌న లావిషింగ్ హౌజ్‌లో భ‌ర్త ఆనంద్ అహుజాతో క‌లిసి క్వారంటైన్ స‌మ‌యాన్ని గ‌డుపుతుంది. తాజాగా త‌న అంద‌మైన ఇంటి ఫోటోల‌ని షేర్ చేసి నెటిజ‌న్స్‌కి థ్రిల్ క‌లిగించింది. బెడ్ రూం ఫోటోతో పాటు ఆనంద్ మ్యూజిక్ ప్లే చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. 

మార్చిలో ఆనంద్ లండ‌న్ నుండి తిరిగి రావ‌డంతో కొద్ది రోజుల పాటు భౌతిక దూరం పాటించింది సోన‌మ్. గ‌త వారం వీరిద్ద‌రు సెకండ్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ జ‌రుపుకున్నారు. ఒక‌రికొక‌రు రొమాంటిక్ విషెస్ చెప్పుకున్నారు. ఆ ఫోటోల‌ని కూడా సోన‌మ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది.
logo