ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 09, 2020 , 10:36:30

సోనాలి బింద్రే చెప్పిన చిట్కాలు..

సోనాలి బింద్రే చెప్పిన చిట్కాలు..

ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో తెలుగుతో పాటు ప‌లు భాష‌ల‌కి సంబంధించిన ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. క్యాన్స‌ర్‌ని జ‌యించిన ఈ అమ్మ‌డు తాజాగా అభిమానుల‌తో కొన్ని చిట్కాలు షేర్ చేసింది. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డానికి ఏఏ టిప్స్ పాటించాలనేది సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

 క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత నేను పాటించిన హెల్త్ టిప్స్‌ను తెలియ‌జేస్తున్నాను. ముందుగా ముఖానికి ఆవిరి పట్టుకోవడం, రెండోది వేడి నీళ్లు తాగాలి. మూడోది ఆపిల్, క్యారెట్, అల్లం, అల్మాండ్, తాజా పసుపు ఉసిరి వంటి పదార్ధాలను కలిపి జ్యూస్ చేసుకోని తాగమని సలహాలు ఇచ్చింది సోనాలి బింద్రే.  ఆరోగ్యంపై ఇంత  అవగాహన నాకు క్యాన్సర్ సోకినపుడే తెలిసింది. అపుడే జీవితం అంటే ఏమిటో తెలిసింది. 

క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డానికి ఏం చేయాలో అన్నీ చేశాను. ఎన్నో పుస్తకాలు చదివి ఆరోగ్యంగా ఉండాలంటే ఏంఏం చేయాలో తెలుసుకున్నాను. వాటి ఆధారంగా ఎన్నో ఎక్స్‌పరిమెంట్స్ చేసానని చెప్పుకొచ్చింది సోనాలి. నేను ఎంతో సీక్రెట్ ఫార్ములాగా భావించే వీటిని మీతో పంచుకున్నాను. ఇక నుంచైనా మనమంతా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారించాలన్నారు సోనాలి.


logo