చూడచక్కని అందంతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న అందాల రాశి సోనాలి బింద్రే. కొన్నాళ్ల క్రితం సోనాలి క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. ఆమె క్యాన్సర్ బారిన పడిందని తెలుసుకున్న అభిమానులు ఎన్నో ప్రార్ధనలు చేశారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అందరి ప్రార్ధనలతో సోనాలి త్వరగానే కోలుకుంది. ప్రస్తుతం సాధారణ జీవితానన్ని గడుపుతుంది. అయితే అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న సమయంలో దిగిన ఫొటోని షేర్ చేసిన సోనాలి అందరికి కన్నీరు పెట్టించింది.
కాలం ఎంతగా మారుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సమయంలో నేను ఎంత వీక్‌గా ఉన్నానో అర్దం అవుతుంది. సి పదం(క్యాన్సర్) తర్వాత నా జీవితం ఎలా ఉందనే విషయాన్ని నిర్వచించకూడదని భావించాను. మీ జీవితాన్ని మీరే ఎంపిక చేసుకోవాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీ జర్నీ కొనసాగుతుందని పోస్ట్ పెట్టింది. సోనాలి బింద్రే తెలుగులో చిరంజీవి, మహేష్, బాలకృష్ణవంటి హీరోలతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే.