న్యూయార్క్ : సెప్టెంబర్ 11 ఉగ్ర దాడి బాధితులకు చేయూతగా నిలిచేందుకు అమెరికాలోని విస్కాన్సిన్ కు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఫీట్ సాధించాడు. ఏడాదిలో ఏకంగా 15 లక్షల పుషప్స్ చేయడం ద్వారా వరల్డ్ రికార్డును బ్రేక్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత ఏడాది జూన్ 13న పుషప్స్ చేయడం ప్రారంభించిన నేట్ కోరాల్ ప్రస్తుతం 15 లక్షల పుషప్స్ ను పూర్తి చేసి అరుదైన మైలురాయి చేరుకున్నాడు.
మొత్తం 15,00,231 పుషప్స్ చేసేందుకు కరోల్ సగటున రోజుకు 4000 పుషప్స్ చేసేవాడు. తన మిషన్ అధికారికంగా జూన్ 13న ముగుస్తుందని కరోల్ చెప్పారు. అత్యంత విషాదకర రోజైన సెప్టెంబర్ 11న అసమాన త్యాగం చేసిన ఎంతో మంది రియల్ హీరోలకు తన రికార్డును నివాళిగా అందిస్తున్నానని కరోల్ పేర్కొన్నారు.