" నా శరీరం, నా క్లీవేజ్, నాకు నచ్చినట్టు నేనుంటానన్న సింగర్...

ముంబై :బాలీవుడ్లో వివాదాస్పద గాయని సోనా మొహపాత్ర మరోసారి వార్తల్లోకి వచ్చింది. ‘మీటూ’ ఉద్యమంలో సంచలన కామెంట్స్‌తో హాట్ టాఫిక్‌గా నిలిచిన ఆమె ఇటీవల ‘ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్’ పేరుతో ఓ చాలెంజ్‌ను కూడా మొదలెట్టింది. అందులో భాగంగా తను కాలేజీ రోజుల్లో ఎదురైన ఓ సంఘటన గురించి వెల్లడించింది. "తాను సల్వార్ దుస్తులు ధరంచి ల్యాబ్‌కు వెళుతుంటే సీనియర్లు అసహ్యంగా మాట్లాడారని, తన లో దుస్తుల గురించి అందరికీ వినబడేలా కామెంట్స్ చేశారని" పేర్కొంది.
అంతేకాదు కొంతమంది తన దగ్గరకు వచ్చి చున్నీ సరిగ్గా వేసుకోవచ్చు కదా.. అని వ్యంగ్యంగా మాట్లాడారని చెప్పింది. ఈ సంఘటన గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ పోస్ట్ చేశాడు. అందులో ఈ ఘటన గురించి ఇంత బాధపడుతున్న మీరు హాట్ హాట్ ఫొటో షూట్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు.
క్లీవేజ్ బాగా కనిపించే ఫొటోలు షేర్ చేస్తూ ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తున్నారని అన్నాడు. ఇలాంటి వాటిని పక్కన బెట్టి ముందు పాటలు పాడటంపై మనసు లగ్నం చేయండంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు అదిరిపోయే సమాధానం ఇచ్చింది.. ఏమనంటే " నా శరీరం, నా క్లీవేజ్, నాకు నచ్చినట్టు నేనుంటా" అంటూ ఘాటుగా ఆన్సర్ చెప్పింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మన చరిత్ర సుధీర్ఘమైనది.. భారత్‌కు సందేశంలో ఆస్ట్రేలియా ప్రధాని
- దేశానికి బలమవుదాం.. కోహ్లి, రహానే రిపబ్లిక్ డే విషెస్
- అటవీశాఖ ఉద్యోగులకు పీసీసీఎఫ్ ప్రశంస
- చరిత్రలోఈరోజు.. రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు
- కూతుళ్ల హత్య కేసు.. తల్లీదండ్రులు అరెస్ట్
- వ్యాక్సిన్ సామర్థ్యంపై ఆస్ట్రాజెనెకా వివరణ
- మా నాన్నకు పద్మ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్స్
- వర్టికల్ చార్లీతో ఆకట్టుకున్న రాఫేల్
- కొత్త సాగు చట్టాలను అమలు చేయం : మహారాష్ర్ట స్పీకర్
- గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా : మంత్రి ఎర్రబెల్లి