బుధవారం 03 జూన్ 2020
Cinema - May 05, 2020 , 11:14:34

వ‌ర్మపై లేడీ సింగ‌ర్ ఫైర్.. కార‌ణం ?

వ‌ర్మపై లేడీ సింగ‌ర్ ఫైర్.. కార‌ణం ?

సంచ‌లన‌ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ ట్వీట్స్ చేయ‌డంలో దిట్ట అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రీసెంట్‌గా మ‌ద్యం షాపులు తిరిగి తెరుచుకోవ‌డంపై ట్వీట్ చేశారు. ఓ వైన్ షాప్ వద్ద పురుషుల‌తో పాటు మ‌హిళ‌లు కూడా క్యూ లైన్‌లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..  ‘‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం’’ అంటూ ట్వీట్ చేశారు వ‌ర్మ‌.

వ‌ర్మ ట్వీట్‌పై  బాలీవుడ్‌ సింగర్‌ సోనా మోహపత్రా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది. డియర్‌ మిస్టర్‌ ఆర్జీవీ. అసలైన విద్యావంతులు ఎలా ఉండాలని నేర్పించే వ్యక్తుల వరుసలో మిమ్మల్ని ఈ ట్వీట్‌ చేరుస్తుంది.  మీరు చేసిన ఈ ట్వీట్  సెక్సిజం, మీ తప్పుడు నైతికత విలువలకు అర్థంగా నిలుస్తోంది. మహిళలకు, పురుషుల మాదిరిగా మద్యం కొనుగోలు, మద్యం సేవించే హక్కు ఉందనే విషయాన్ని గమనించండి. అయితే మద్యం సేవించాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు’’ అంటూ ఆర్జీవీకి గట్టి కౌంటర్ వేసింది. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.


logo