గురువారం 04 మార్చి 2021
Cinema - Nov 25, 2020 , 14:41:59

హైద‌రాబాద్‌లో క‌లెక్ష‌న్ కింగ్ సన్ ఆఫ్ ఇండియా షూటింగ్ ..

హైద‌రాబాద్‌లో క‌లెక్ష‌న్ కింగ్ సన్ ఆఫ్ ఇండియా షూటింగ్ ..

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే ప‌ట్టాలెక్కుతున్నాయి. కుర్ర హీరోలు గ‌త నెల‌లోనే షూటింగ్స్ స్టార్ట్ చేయ‌గా, ఇక ఇప్పుడు సీనియ‌ర్ హీరోలు మొద‌లు పెట్టారు. తాజాగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు స‌న్ ఆఫ్ ఇండియా చిత్రీక‌ర‌ణని స్టార్ట్ చేశాడు.  అక్టోబ‌ర్ లో ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ముహూర్త‌పు షాట్‌ని చిత్రీక‌రించారు. నిర్వాణ, మంచు ల‌క్ష్మీ క్లాప్ కొట్ట‌గా.. విరానిక మంచు, ఐరా, అవ్‌రామ్ కెమెరా స్విచాన్ చేశారు. తొలిషాట్‌ని విష్ణు మంచు డైరెక్ట్ చేశారు.  

కొత్తదనం,  సమాజానికి ఉపయుక్తమయ్యే సందేశం మేళవించిన ఇతివృత్తాల‌తో సినిమాలు చేస్తున్న మోహ‌న్ బాబు తాజాగా  దేశభక్తి ప్రధానంగా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్ర టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా,  ఇందులో కోపోద్రిక్తుడై తీక్షణ చూపులతో కనిపిస్తున్నారు మోహన్‌బాబు. ‘ఇప్పటివరకు తెలుగు తెరపై రానటువంటి కథాంశమిది. వినూత్నమైన జోనర్‌లో చేయబోతున్నాం. మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది.  ఇళ‌య‌రాజా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నేటి నుండి ఈ మూవీ రెండో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. వీలైనంత త్వ‌ర‌గా ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని మేక‌ర్స్  భావిస్తున్నారు.

VIDEOS

logo