టాలీవుడ్ (Tollywood) యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం వివాహ భోజనంబు (Vivaha Bhojanambu). కమెడియన్ సత్య (Satya) హీరోగా పరిచయమవుతున్నాడు. ఆగస్టు 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
సినిమాలు నిర్మించాలన్న ఆసక్తి ఏంటనీ ప్రశ్నించగా..యాక్టర్ గా నేను చేయలేని కొన్నికథలున్నాయి. ఆ కథలను తెరపై చూపించేందుకు నేను నిర్మాతగా మారాను. రాబోయే రోజుల్లో నేను మరిన్ని కొత్త ఆలోచనలతో సినిమాలు చేస్తానని చెప్పాడు. సత్య యాక్టింగ్ పై స్పందిస్తూ..ఈ సినిమాకు మొదట హీరోగా సత్యను అనుకోలేదు. కానీ అతని పేరు వినిపించగానే నాకు ఎక్జయిటింగ్ గా అనిపించింది. కొంత అనుమానంతోనే సినిమాను మొదలుపెట్టామన్నాడు.
సత్య తన యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టేశాడని సందీప్ కిషన్ చెప్పాడు. వన్ మ్యాన్ ఆర్మీలా సినిమాను నడిపించాడు. సినిమాలో చివరి సీన్ వరకు సత్య నవ్విస్తూనే యాక్టింగ్ ను చింపేశాడని చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్. ఈ యువ నటుడు ప్రస్తుతం తెలుగులో గల్లీ రౌడీ సినిమా చేస్తున్నాడు. తమిళంలో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!