సోమవారం 01 మార్చి 2021
Cinema - Jan 23, 2021 , 07:00:26

చిరు ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మైన సోహెల్‌.. ఫొటోలు వైర‌ల్

చిరు ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మైన సోహెల్‌.. ఫొటోలు వైర‌ల్

బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు సోహెల్‌. అంత‌క‌ముందు సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించిన పెద్ద‌గా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ షో సోహెల్ జీవితాన్నే మార్చేసింది అని చెప్పాలి. ఆయ‌నకు ఇప్పుడు మాముము ప్ర‌జ‌లే కాదు సెల‌బ్రిటీలు కూడా ఫ్యాన్స్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సోహెల్ కోసం త‌న భార్య సురేఖ‌తో బిర్యాని వండించి పంపాడు. అంతేకాక సోహెల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వ‌స్తాన‌ని బిగ్ బాస్ ఫినాలే వేదిక‌గా చెప్పాడు.

చిరంజీవిని చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగిన సోహెల్ ఇప్పుడు ఏకంగా ఆయ‌న ఇంటికి వెళ్ళి ఆయ‌న ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపే అవ‌కాశాన్ని పొందాడు. దీనంత‌టికి కార‌ణం బిగ్ బాస్ అనే చెప్పాలి. శుక్ర‌వారం మెగాస్టార్ ఇంటికి వెళ్ళిన సోహెల్ చిరుతో పాటు ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ‌, త‌ల్లి అంజ‌నా దేవితో క‌లిసి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా, సోహెల్ ఇటీవ‌ల ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని జార్జిరెడ్డి నిర్మాత‌లు రూపొందిస్తున్నారు.

VIDEOS

logo