మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 07:30:22

అరియానా బ‌ర్త్‌డేలో సోహెల్‌, మోనాల్‌ల ముద్దు ముచ్చ‌ట్లు

అరియానా బ‌ర్త్‌డేలో సోహెల్‌, మోనాల్‌ల ముద్దు ముచ్చ‌ట్లు

బిగ్ బాస్ సీజ‌న్ 4 కోసం హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ అంద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింది. ముఖ్యంగా సోహెల్, మోనాల్‌, అఖిల్‌, మెహ‌బూబ్ లు త‌ర‌చు క‌లుస్తూ రచ్చ చేస్తున్నారు. తాజాగా అరియానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోహెల్‌, మెహ‌బూబ్, లాస్య‌, మోనాల్‌, కుమార్ సాయి ఓ చోట చేరారు. వీరంద‌రికి అరియానా లంచ్ పార్టీ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. 

అయితే పార్టీకి హాజ‌రైన సోహెల్ ..మోనాల్‌ని హ‌గ్ చేసుకొని హ‌గ్గులు, కిస్సులతో రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసుకున్నాడు సోహెల్‌. ఇక హౌజ్‌లో ఉన్న‌ప్పుడు అరియానాతో టామ్ అండ్ జెర్రీలా ఉండే సోహెల్ బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆమెతో చాలా క్లోజ్ అయ్యాడు. అరియానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వాచ్ కూడా బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే అరియానా బెస్ట్ ఫ్రెండ్ అవినాష్ పార్టీలో మిస్ అయిన‌ట్టు క‌నిపించింది. అందుకు కార‌ణం ఏదో షూటింగ్‌తో బిజీగా ఉండ‌డ‌మే అని చెప్పుకొచ్చారు.

VIDEOS

logo