తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం ఎంత సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత సీజన్స్ కన్నా సీజన్ 4 కార్యక్రమం కాస్త ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తల మధ్య ఈ షోని నిర్వహించగా, ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకుల మనసులని ఎంతగానో గెలుచుకుకున్నారు. ముఖ్యంగా సింగరేణి ముద్దు బిడ్డ సోహైల్ అయితే ఓ రేంజ్లో అభిమానులకు కనెక్ట్ అయిపోయాడు. చిన్న హీరోకి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ఆ రేంజ్లో సోహైల్ అభిమానుల ఆదరణ పొందాడు.
వంద రోజుల పాటు హౌజ్‌లో ఉన్న సోహైల్ తన ఆటిట్యూడ్, ఎంటర్టైన్మెంట్ ఎంతగానో అలరించాడు. అందుకే బిగ్ బాస్ నుండి రాగానే ఆయనకు మంచి ఆదరణ దక్కుతుంది. రీసెంట్గా లక్కీ అనే అభిమాని ఏప్రిల్ 18న సోహైల్ బర్త్ డే కావడంతో అడ్వాన్స్‌గా స్పోర్ట్స్ బైక్‌ను సర్ప్రైజ్ గిఫ్ట్‌గా అందించారు. సాధారణంగా అభిమానులు నా కోసం గిఫ్ట్ లు కొనడం నేను ఏ మాత్రం ఎంకరేజ్ చేయను. కాని లక్కీతో మాట్లాడాక ఈ బహుమతి తీసుకోవాలని అనిపించింది.ఇది నాకు చాలా స్పెషల్ అంటూ సోహైల్ తన వీడియోలో పేర్కొన్నాడు.