మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 09:28:42

టూత్ పేస్ట్‌తో ఫేస్ వాష్ చేసుకున్న సోహైల్

టూత్ పేస్ట్‌తో ఫేస్ వాష్ చేసుకున్న సోహైల్

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా 81 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. సోమ‌, మంగ‌ళ‌వారాల‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌గా, బుధ‌వారం ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌ని దెయ్యాల కొంపగా మార్చారు. ఓ దెయ్యం బొమ్మ అరియానా ముందు  ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఉలిక్కి ప‌డ్డ ఆమె చివ‌ర‌కి వ‌ర‌కు అలానే కంటిన్యూ చేసింది. హారిక‌, అవినాష్‌, అఖిల్, సోహైల్‌లు ద‌మ్ముంటే రా.. నీ ప‌తాపం ఏంటో మా పతాపం ఏంటో చూసుకుందాం అన్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చారు. అవినాష్ అయితే క‌కృతి ప‌డ్డ‌ట్టు ద‌య్యాన్ని కూడా పెళ్లిచేసుకుంటాన‌ని కుళ్లు జోకులు చేశాడు.

బుధవారం ఎపిసోడ్ విష‌యానికి వ‌స్తే సోహైల్ ఫేస్ వాష్ అనుకొని టూత్ పేస్ట్ పెట్టి వాష్ చేసుకున్నాడు. దీంతో అంద‌రు అత‌నిని ఏడిపించారు. ఇక ఎవిక్ష‌న్ పాస్ పొందిన అవినాష్ ఇంట్లో అంద‌రి ముందు పంచ్‌లు వేయ‌సాగాడు. దీంతో సోహైల్‌, అరియానా‌లు ఆయ‌న‌పై సెటైర్స్ వేశారు. అరియానా అయితే ఊస‌ర‌వెల్లి అని, నామినేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఒక‌లా లేన‌ప్పుడు ఒక‌లా ఉంటాడ‌ని చెప్పుకొచ్చింది . ఇక మోనాల్‌.. అఖిల్ వెనుక ప‌డుతూ హ్యాపీ టూ సీయు అన‌డంతో  అత‌ను నువ్వు ఏం చెప్పిన నిజం అనిపించ‌దు, ఏదో చెప్పాల‌ని చెప్తావు అంటూ తుస్సుమ‌నిపించాడు 

ఇక ఎప్ప‌టిలానే అవినాష్‌తో కాసేపు ఆడుకోవాల‌ని భావించిన అఖిల్‌.. అరియానా భుజంపై చేయి వేసి పులిహోర క‌లిపాడు. దీనికి అరియానా మేం క్లోజ్ ఫ్రెండ్స్ అన‌డం, అఖిల్ మా మ‌ధ్య వాట‌ర్ పోసిన కింద‌కు జార‌దు అని అన‌డం ..ఇది విని మోనాల్ లోప‌లికి వెళ్ల‌డం దాంతో అక్క‌డ కొంత సేపు డ్రామా జ‌రిగింది. అఖిల్‌.. అరియానాపై చేయి వేస్తున్నాడ‌ని, అవినాష్ కూడా మోనాల్‌తో క‌లిసి ఆట‌ప‌ట్టిందామ‌నుకుంటే అందుకు మోనాల్ అంత ఇంట్రెస్ట్ చూపించ‌క‌పోవ‌డంతో అవినాష్ ప్లాన్ బిస్కెట్ అయింది


logo