గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 22, 2020 , 09:39:22

సోహైల్ సీక్రెట్ చెప్పి షాకిచ్చిన ఆయ‌న సోద‌రుడు

సోహైల్ సీక్రెట్ చెప్పి షాకిచ్చిన ఆయ‌న సోద‌రుడు

కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడే క్ర‌మంలో నాగ్ అడిగిన ప్ర‌శ్న‌కు లాస్య స‌మాధానం ఇచ్చింది. సేఫ్ గేమ్ ఆడుతూ ఇంత‌వ‌ర‌కు నెట్టుకొచ్చింది ఎవ‌ర‌ని నాగ్ అడ‌గ‌గా, అందుకు అవినాష్ పేరు చెప్పింది. దీంతో లాస్య త‌ల్లి శాంత‌మ్మ బిగ్ బాస్ స్టేజ్ పైకి వ‌చ్చారు. మీ అమ్మాయి బిగ్ బాస్ షోకు వ‌చ్చాక చాలా షాకులు ఇచ్చింది క‌దా అని నాగ్ అన్నారు. ఇక శాంత‌మ్మ ఉద్దేశం ప్ర‌కారం టాప్ 5‌లో లాస్య‌, అభిజిత్‌, సోహైల్‌, అఖిల్‌, హారిక టాప్ 5లో ఉంటార‌ని చెప్పుకొచ్చింది.  

 అనంత‌రం సోహైల్ వంతు రాగా, ఆయ‌న‌కు బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాక ఇంటిస‌భ్యుల్లో ఎవ‌రితో స్నేహాన్ని కొన‌సాగించ‌వు? అనే ప్ర‌శ్న ఎదురు కాగా, అభిజీత్ పేరు చెప్పాడు. అత‌నిది క్లాస్ మాది మాస్ అంటూ వివ‌ర‌ణ ఇచ్చాడు. దీంతో సోహైల్‌తో మాట్లాడేందుకు ఆయ‌న  బ్ర‌ద‌ర్స్ స‌బిల్‌, రామారావు స్టేజీ మీద‌కు వ‌చ్చారు. సోహైల్‌, అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అరియానా టాప్ 5లో ఉంటార‌ని చెప్పుకొచ్చారు. అయితే రామారావు సోహైల్ గురించి ఓ సీక్రెట్ చెప్పారు.

రాత్రి తొమ్మిది త‌ర్వాత ఫోన్‌లో మునిగిపోతాడ‌ని, అమ్మాయిల‌తో చాటింగ్ చేస్తాడ‌ని రామారావు అన‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. హౌజ్‌మేట్స్ అంతా ఇది గుర్తు పెట్టుకోండ‌ని నాగార్జున అన‌డంతో సర్.. వాళ్లంతో ఫ్రెండ్స్ అంటూ క‌వ‌రింగ్ చేసుకున్నాడు.


logo