బిగ్ బాస్ షోతో పాపులారిటీ దక్కించుకున్న కంటెస్టెంట్స్‌లో అఖిల్, సోహెల్ ఉన్నారు. వీరిద్దరు బిగ్ బాస్ హౌజ్‌లోనే కాదు బయటకు వచ్చాక కూడా చాలా స్నేహంగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో వారి ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది.వీరికి సెలెబ్రిటీ హోదా వచ్చేసింది. క్రేజ్‌తో పాటు సినీ అవకాశాలు కూడా పెరిగాయి. ప్రతీ ఒక్కరి చేతిలో బోలెడన్ని ప్రాజెక్ట్‌లున్నాయి. సోహెల్ ఆల్రెడీ హీరోగా సినిమాను మొదలుపెట్టేశారు. ఇక అఖిల్ చేతిలో వెబ్ సిరీస్, సినిమాలున్నాయి.
సెలబ్రిటీలు ఎప్పుడు స్నేహంగా మెలిగినా కూడా అభిమానులు మాత్రం ఏదో విషయంలో గొడవపడుతూనే ఉంటారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోహెల్.. అఖిల్ గాడికంటే నేను ఏజ్‌లో తక్కువ అని చెప్పుకొచ్చారు. అఖిల్ అని ఎప్పుడు సంబోధించే సోహెల్ ఇప్పుడు అఖిల్ గాడు అనడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలానే ఫ్యాన్స్ కొట్టుకోవడం, తిట్టుకోవడంపైనా ఫైర్ అయ్యారు సోహైల్.