మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 03, 2020 , 09:18:52

అరియానా - సోహైల్ మ‌ధ్య మాట‌ల యుద్ధం

అరియానా - సోహైల్ మ‌ధ్య మాట‌ల యుద్ధం

సోమ‌వారం కావ‌డంతో బిగ్ బాస్ హౌజ్‌లో నామినేష‌న్ ప్ర‌క్రియ షురూ అయింది. ఎవ‌రి పేరు బిగ్ బాస్ చెబితే వారెళ్ళి నామినేష‌న్ చేయాల‌నుకునే వారి త‌ల‌పై రెండు ఎగ్స్ ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుంది. అయితే ఎగ్ అంటే ప‌డ‌ని మోనాల్ త‌ను కొట్టించుకోలేన‌ని చెప్ప‌డంతో ఆల్ట‌ర్‌నేట్ స‌ల‌హా ఇచ్చాడు. మీకు బదులుగా మీరు నామినేట్ చేసేవాళ్ల తలపై వేరేవాళ్ళు కోడిగుడ్డు పగల గొట్టాలని కోరవచ్చని చెప్పారు. ముందుగా కెప్టెన్ అరియాని పేరుని పిలిచారు బిగ్ బాస్.

హారిక త‌ల‌పై కోడిగుడ్డు కొట్టిన అరియానా ఆమెని నామినేట్ చేసింది. రాక్ష‌సుల టాస్క్‌లో ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా నామినేట్ చేసాన‌ని చెప్పుకొచ్చింది. ఇక రెండో గుడ్డుని సోహైల్‌పై ప‌గ‌ల‌గొట్ట‌గా, అత‌నిని నామినేట్ చేయ‌డానికి కార‌ణం ప‌నిష్మెంట్ విష‌యంలో ర‌చ్చ చేయ‌డం అని అంది. ఈ విష‌యంలో నీదే త‌ప్పు. నేను సాయంత్రం చేస్తా అన్నాను. నువ్వే చాలా ఓవ‌రాక్ష‌న్ చేశావు అంటూ సోహైల్ ఆమెపై ఎగిరాడు ఆటిట్యూడ్ చూపించ‌కు , అదీ, ఇదీ అంటూ అరియానాపై నోరుజారుతూనే ఉన్నాడు. త‌ను మాత్రం సైలెంట్‌గా ఉండి త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లింది. 

నువ్వు ప‌నిష్మెంట్ విష‌యంతో నామినేట్ చేయడం నాకు అస్స‌లు న‌చ్చ‌లేదు అని సోహైల్ అన‌డంతో అరియానా మ‌రో విష‌యాన్ని చెప్పుకొచ్చింది. ఈ వారం కెప్టెన్ టాస్క్‌లో నువ్వు న‌న్ను మోసం చేసిన‌ట్టు అనిపించింది అన‌డంతో సోహైల్ అవును మోసం చేశాను. కావాల‌నే మోసం చేశాను అన్నాడు. అస‌లు థ‌ర్డ్ రౌండ్ కూడా ఎందుకు ఆడానో అంటూ చిరాకు వ‌స్తుంద‌ని త‌న అస‌హ‌నాన్ని అరియానా ద‌గ్గ‌ర వెళ్ళ‌గ‌క్కాడు. 


logo