మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 03, 2020 , 09:07:23

మోనాల్ మీద అలిగిన అఖిల్.. పిచ్చోడిలా ప్ర‌వ‌ర్తించిన సోహైల్‌

మోనాల్ మీద అలిగిన అఖిల్.. పిచ్చోడిలా ప్ర‌వ‌ర్తించిన సోహైల్‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం మంచి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే అంద‌రు మాస్క్‌లు తొల‌గిస్తున్నారు. సోమ‌వారం రోజు నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గగా, బిగ్ బాస్ హౌజ్ హీటెక్కిపోయింది. 58వ ఎపిసోడ్ అఖిల్, మోనాల్ ముచ్చ‌ట‌తో ప్రారంభ‌మైంది. నా ప‌క్క‌న కూర్చోవ‌డం లేదు, న‌న్ను నిర్ల‌క్ష్యం చేస్తున్నావు అని మోనాల్ అన‌డంతో అలాంటిదేమి లేద‌ని అన్నాడు అఖిల్. అయితే ఓ హ‌గ్ ఇవ్వు అని మోనాల్ అన‌డంతో అఖిల్ ఆమెను కౌగిలించుకున్నాడు. ఇది నా అఖిల్ హ‌గ్ కాదంటూ మోనాల్ అన‌డంతో నాకు కొంత టైం ఇవ్వు అని అన్నాడు.

ఇక సోహైల్‌, మెహ‌బూబ్ ప్ర‌పంచాన్ని మ‌ర‌చిపోయి నిద్ర‌పోతుంటే బిగ్ బాస్ హౌజ్ లో కుక్క‌లు మొరిగాయి. మెహ‌బూబ్ త‌ను నిద్ర పోతున్న విష‌యాన్ని ఒప్పుకోగా, సోహైల్ క‌వర్ చేసుకున్నాడు. అయితే కెప్టెన్‌గా ఉన్న అరియానా.. మెహ‌బూబ్‌ని రెండు బ‌కెట్ల నీళ్ళు పోసుకోవాల‌ని ప‌నిష్మెంట్ ఇచ్చింది. ఇందులో భాగంగా మెహ‌బూబ్‌పై సోహైల్ రెండు బ‌కెట్ల నీళ్ళు గుమ్మ‌రించాడు. మరి కొద్ది సేప‌టి త‌ర్వాత సోహైల్ మ‌ళ్ళీ నిద్రించాడు. దీంతో మ‌ళ్ళీ కుక్క‌లు మొరిగాయి. ప‌నిష్మెంట్‌లో భాగంగా సోహైల్ త‌న‌పై నీళ్ళు పోసుకోవాల‌ని అరియానా అన‌డంతో విభేదించాడు సోహైల్.

ఇప్పుడే స్నానం చేసి వ‌చ్చాను. సాయంత్రం పోసుకుంటాను అని సోహైల్ అన‌డంతో అరియానా తిర‌స్క‌రించింది. దీతంతో కోపంతో ఉరుక్కుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. నేను ఇక్క‌డే ఉంటా, త‌డి బ‌ట్ట‌ల‌తోనే ఉంటా. నా ఇష్టం అంటూ పిచ్చోడిలా ప్ర‌వ‌ర్తించాడు. అఖిల్, అమ్మ రాజ‌శేఖ‌ర్ ఎంత చెప్పిన కూడా  సోహైల్ విన‌లేదు. దీంతో విసిగిపోయిన అఖిల్ మీరు ప‌క్క‌కి వ‌చ్చేయండి అంటూ అవినాష్‌తో అన్నాడు. ఇక సొహైల్ షూ లేస్ తీసుకున్న అరియానా దాన్ని తిరిగిఇవ్వకపోవడంతో నీకు ప‌నిష్మెంట్ ఇస్తా అన్నాడు. అదేంట‌ని అర‌గంట త‌ర్వాత చెప్తా అంటూ త‌న బెడ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళాడు 


logo