శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 20, 2020 , 16:07:08

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి కృతజ్ఞతలు : సోహ అలీఖాన్‌ తనయ

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి కృతజ్ఞతలు : సోహ అలీఖాన్‌ తనయ

కొవిడ్‌-19 బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు ఇంట్లోనే ఉండమని లాక్‌డౌన్‌ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కానీ వైద్యులు, పోలీసులు మాత్రం డ్యూటీని విడిచి పెట్టడం లేదు. వీరిలో ఒకరైన  ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి కృతజ్ఞతలు తెలిపేందుకు బెంగాలి నటి సోహ అలీఖాన్‌ కూతురు ఇనాయ నౌమి కెమ్ము అద్భుతమైన పెయింట్‌ వేసింది. మేఘాలు, ఇంద్రధనస్సు ఉన్న ఈ పెయింటింగ్‌ను వీరికి అంకితం చేసింది. థ్యాంక్స్‌ టు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ అని పేర్కొన్నది. రెండేండ్ల ఇనాయను చిన్నపిల్లలే అని కొట్టిపారేయలేం. గల గల మాట్లాడటంతోపాటు ఇంటి పనులన్నీ చకచకా చేస్తుంది. ఈ పనితనం చూస్తుంటే మా పూర్వీకులే గుర్తొస్తున్నారు అంటున్నది తల్లి సోహ. అంతేకాదు ఇనాయ పుస్తకాల పురుగు. అంటే.. బుక్స్‌  చదివదు. భద్రంగా దాచిపెడుతుంది. తాను వేసిన చిత్రాలన్నింటినీ ఎప్పటికప్పుడు సోహ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ట్‌ చేస్తూ ఉంటుంది. చిన్నారికి దేశభక్తి కూడా ఎక్కువే. ఊహతెలియని వయసులోనే ఇన్ని మంచి పనులు చేస్తున్న ఇనాయాకు అందరూ ఫిదా అవుతున్నారు.logo