శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 21:44:44

సీఎం కేసీఆర్ విజ్ఞ‌ప్తికి చాలా మంది స్పందించారు: ప‌వ‌న్ క‌ళ్యాణ్

సీఎం కేసీఆర్ విజ్ఞ‌ప్తికి చాలా మంది స్పందించారు: ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్ వర‌ద‌ల నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ..గ‌త ఐదారు ద‌శాబ్దాల్లో ఇలాంటి వ‌ర్ష‌పాతం న‌మోదవ‌లేదన్నారు. గతంలో కూడా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. ప్రాణ న‌ష్టం జ‌రిగింది. కానీ ఈ స్థాయిలో న‌ష్టం సంభ‌వించ‌లేదు. దీనికార‌ణం అర్బ‌న్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. చ‌ట్టాన్ని ఉల్లంఘించి నాలాలు ఆక్ర‌మించ‌డం, నాలాల మీద ఎలాంటి నిర్మాణాలు ఉండ‌కూద‌ని ఉంటే వాటిని లెక్క‌చేయ‌డం లేదు.  నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇండ్లు క‌ట్ట‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లున్నా.. 40-50 సంవ‌త్స‌రాలుగా గ‌త ప్రభుత్వాలు వాటిని అతిక్ర‌మించుకుంటూ వ‌చ్చాయి. వ‌ర‌ద‌ల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా.

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వ యంత్రాంగంతోపాటు వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రికి వారు స్పందించి తోచినంత విరాళాలివ్వాల‌న్నారు. క‌రోనా ప్ర‌భావంతో ఆర్థిక వ్య‌వ‌స్థ ఆగిపోయింది. బ‌య‌ట డ‌బ్బే పుట్ట‌డం లేదు. పోని ప‌నిచేద్దామంటే ప్ర‌స్తుత కోవిడ్ ప్ర‌భావంతో ప‌నిచేసే ప‌రిస్థితులు లేవు. ఇలాంటి టైంలో విరాళాలివ్వ‌డం ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. వ‌ర‌ద‌ల‌తో నిరాశ్ర‌యులైన వారిని ఆదుకునేందుకు ముందుకు రావాల‌ని సీఎం కేసీఆర్ విజ్ఞ‌ప్తి మేర‌కు చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు స్పందించారు. చురుగ్గా ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వం కావ‌డంతో అంద‌రూ కాస్త ఇబ్బంది అయినా విరాళాలిస్తున్నారు. 

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో పేరున్నంతగా డ‌బ్బు ఉండ‌దు. మా ఇంట్లోనే ఆరెంజ్ సినిమాకు సోద‌రుడు నాగ‌బాబుకు న‌ష్ట‌మొస్తే మేమంతా క‌లిపి న‌ష్టాన్ని బయ‌టి వాళ్ల‌కు ఇచ్చాం. నేను అత్తారింటికి దారేది సినిమా చేసిన‌పుడు..ముందే సినిమాను నెట్ లో విడుద‌ల చేశారు. దీంతో కొన‌డానికి ఎవ‌రూ రాలేదు. నేను సంత‌కాలు పెట్టి  విడుద‌ల చేయాల్సి వ‌చ్చింద‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.