శనివారం 30 మే 2020
Cinema - May 13, 2020 , 10:39:55

వైర‌ల్‌గా మారిన స్నేహ‌- ప్ర‌స‌న్న యానివ‌ర్స‌రీ ఫోటోలు

వైర‌ల్‌గా మారిన స్నేహ‌- ప్ర‌స‌న్న యానివ‌ర్స‌రీ ఫోటోలు

బాపు దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ రాధా గోపాళం చిత్రంలో న‌టించిన స్నేహ ఈ చిత్రం త‌ర్వాత బాపు బొమ్మ‌గా అభిమానుల గుండెల‌లో నిలిచిపోయింది. తెలుగు, త‌మిళంలో అనేక హిట్ చిత్రాలలో న‌టించిన స్నేహ కెరీర్ పీక్స్‌లో ఉండగానే త‌మిళ హీరో ప్ర‌స‌న్న‌ని వివాహం చేసుకుంది. మే 11, 2012న వీరి వివాహం జ‌ర‌గ‌గా, మొన్న‌టితో ఎనిమిదో వ‌సంతం పూర్తి చేసుకున్నారు.  `అచాముండు అచముండు` చిత్రంలో వీరిద్ద‌రు  నాయికా నాయికలుగా నటించగా, ఆ స‌మ‌యంలోనే ప్రేమ పుట్టిన‌ట్టు తెలుస్తుంది. 

ప్ర‌స‌న్న‌- స్నేహ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీకి సంబంధించిన ఫోటోల‌ని ప్ర‌స‌న్న త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి వైరల్‌గా మారాయి. మ‌రో వైపు స్నేహ కూడా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనిమిదేళ్ళ జ్ఞాప‌కాల‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. వీరికి విహాన్ అనే కుమారుడు ఉండ‌గా, ఈ ఏడాది జ‌న‌వ‌రి 24న‌ ఆడ‌పిల్ల జ‌న్మించింది. కాగా, ఇటీవ‌లి కాలంలో స్నేహ‌  విన‌య విధేయ రామ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌కి వ‌దిన‌గా న‌టించింది. త‌మిళ చిత్రం ప‌టాస్‌లోను మెరిసింది. 
logo