e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News టీకా వేయించుకునేందుకు స్నేహా ప‌డ్డ తిప్ప‌లు చూడండి- వీడియో

టీకా వేయించుకునేందుకు స్నేహా ప‌డ్డ తిప్ప‌లు చూడండి- వీడియో

టీకా వేయించుకునేందుకు స్నేహా ప‌డ్డ తిప్ప‌లు చూడండి- వీడియో

విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న న‌టి స్నేహ‌. తెలుగు ప్రేక్షకులకి మాత్రం గోపీచంద్ హీరోగా నటించిన తొలివలపు సినిమాతో పరిచయం అయింది. ఇక ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి సినిమాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి. తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టించింది స్నేహ. తమిళ చిత్రం అచ్చముండు అనే షూటింగ్‌ సమయంలో నటుడు ప్రసన్నతో స్నేహ ప్రేమలో ప‌డిన స్నేహా 2012లో అత‌డిని పెళ్లి చేసుకుంది.

ప్ర‌స‌న్న‌, స్నేహా దంప‌తుల‌కు ఒక బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన స్నేహా మళ్ళీ తన రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విదేయ రామ సినిమాలో నటించింది. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో ఆమె నటించారు. అయితే ఈ అమ్మ‌డు తాజాగా వ్యాక్సిన్ వేయించుకోగా, ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది. టీకా వేసుకోవటానికి సిద్ధమైనా.. సూది దగ్గరకు వచ్చేసరికి వెనక్కి వెళ్లటం.. మళ్లీ ముందుకు రావటం.. సూది చేతికి దగ్గరకు రాగానే.. ఇంజెక్షన్ కు ఆమె భయపడిన వైనాన్ని ఆమెకు దగ్గరగా ఉన్న భర్త ప్రసన్న స్వయంగా వీడియో తీశారు. తాజాగా దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోపై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీకా వేయించుకునేందుకు స్నేహా ప‌డ్డ తిప్ప‌లు చూడండి- వీడియో
టీకా వేయించుకునేందుకు స్నేహా ప‌డ్డ తిప్ప‌లు చూడండి- వీడియో
టీకా వేయించుకునేందుకు స్నేహా ప‌డ్డ తిప్ప‌లు చూడండి- వీడియో

ట్రెండింగ్‌

Advertisement