గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘శాకుంతలం’ సినిమా సెట్స్‌లో అగ్రహీరో అల్లు అర్జున్ సందడి చేశారు. షూటింగ్ లొకేషన్‌కు సతీమణి స్నేహారెడ్డితో కలిసి వెళ్లిన ఆయన యూనిట్ సభ్యుల్ని సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారాల తనయ అర్హ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిన్నారి ఇప్పటికే పదిరోజుల షూటింగ్లో పాల్గొంది. మరోసారి చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో విడుదలైన వీడియోలు సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్హ ..శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో నటిస్తోంది. షూటింగ్ లొకేషన్‌కు విచ్చేసిన అల్లు అర్జున్ దంపతులు అర్హ నటనను వీక్షించారు. తమ గారాలపట్టి అభినయం చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుడి ప్రణయగాథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.