శనివారం 04 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 11:21:54

బుల్లితెర న‌టికి క‌రోనా..!

బుల్లితెర న‌టికి క‌రోనా..!

కరోనా ప్రభావం వ‌ల‌న దాదాపు మూడు నెల‌లుగా సీరియ‌ల్స్, సినిమా షూటింగ్స్‌కి బ్రేక్‌లు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల ప్ర‌భుత్వం క‌రోనా గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్ జ‌రుపుకోవ‌చ్చు అని ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో కొన్ని సీరియ‌ల్స్, షోస్ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. షూటింగ్ మొద‌లైన కొద్ది రోజుల‌కే  బుల్లితెర నటుడు ప్రభాకర్ బారిన ప‌డ్డారు. ఆ త‌ర్వాత ప్ర‌భాక‌ర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న హ‌రికృష్ణకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 

తాజాగా బుల్లితెర న‌టి న‌వ్య‌సామి వైర‌స్ బారిన ప‌డిన‌ట్టు స‌మాచారం. ‘నా పేరు మీనాక్షి’ మరియు ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను అల‌రిస్తున్న ఈమె కొద్ది రోజులుగా క‌రోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుంది. దీంతో వైరస్ నిర్థారణ పరీక్ష చేయగా,  పాజిటివ్ అని తేలింద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆమెతో క‌లిసి పని చేసిన వారంద‌రికి ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం.  


logo