శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 29, 2020 , 11:52:39

25వేల మంది కార్మికుల‌ని ఆదుకోనున్న స‌ల్మాన్

25వేల మంది కార్మికుల‌ని ఆదుకోనున్న స‌ల్మాన్

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కి సామాజిక స్పృహ చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఎలాంటి విపత్క‌ర పరిస్థితులు వ‌చ్చిన తానున్నాన‌నే భ‌రోసా ఇస్తుంటాడు స‌ల్లూ భాయ్. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో సినీ కార్మికుల ప‌డుతున్న ఇబ్బుందుల‌ని గ్ర‌హించిన స‌ల్మాన్ ..  సుమారు పాతిక వేల మంది కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వారందరకీ రోజువారీ నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం అందివ్వాలని సల్మాన్ సంకల్పించుకున్నారు. స‌ల్మాన్ పెద్ద మ‌న‌సుపై ప్ర‌శంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్స్. బాలీవుడ్ నుండి అక్ష‌య్ కుమార్ ఇప్ప‌టికే రూ.25 కోట్ల విరాళాన్ని ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే 


logo