శనివారం 06 జూన్ 2020
Cinema - May 13, 2020 , 14:49:07

శేఖ‌ర్ క‌మ్ముల‌ని ఫిదా చేసిన పారిశుద్ధ్య కార్మికులు

శేఖ‌ర్ క‌మ్ముల‌ని ఫిదా చేసిన పారిశుద్ధ్య కార్మికులు

క్రియేటివ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల గ‌త నెల 27న‌ నార్త్‌జోన్‌ పరిధిలో పనిచేసే వెయ్యి మంది పారిశుద్ధ్య సిబ్బందికి నెలరోజుల పాటు బాదంపాలు, మజ్జిగ ఉచితంగా అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ద్వారానే కార్మికులకు అందించగలిగితే వారికి మరింత గౌరవం ఇచ్చిన వారమవుతామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  పారిశుద్ధ్య కార్మికులు నా దృష్టిలో దేవుళ్లతో సమానం. విపత్కర పరిస్థితుల్లో ఎండలను లెక్కచేయకుండా కార్మికులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. వారికి నా తోచినంత సాయం చేస్తున్నాను అని శేఖ‌ర్ క‌మ్ముల స్ప‌ష్టం చేశారు.

శేఖ‌ర్ క‌మ్ముల సాయానికి కృత‌జ్ఞ‌త‌గా పారిశుద్ధ్య కార్మికులు అంద‌రు ఫ్ల‌క్లార్డ్స్ ప‌ట్టుకొని శేఖ‌ర్ క‌మ్ముల గారు.. థ్యాంక్యూ అని బోర్డులు ప్ర‌ద‌ర్శించారు. వారి ప్రేమ‌కి మురిసిపోయిన శేఖ‌ర్ క‌మ్ముల త‌న ట్విట్ట‌ర్ ద్వారా.. మీరు చేసే పనుల‌తో చూస్తేన నేను చేసింది చాలా చిన్న‌ది. మీరు నా పై చూపించిన ప్రేమ‌ని నేను పెద్ద అతి పెద్ద అవార్డుగా భావిస్తాను అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు


logo