ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 09:13:53

ఏడో వారం నామినేష‌న్‌లో ఆ ఆరుగురు..!

ఏడో వారం నామినేష‌న్‌లో ఆ ఆరుగురు..!

బుల్లిత‌ర బిగ్ రియాలిటీ షోలో ఏడో వారం నామినేష‌న్ ప్ర‌క్రియ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అమీతుమీ టాస్క్‌ డీల్‌లో భాగంగా.. హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న నోయల్ డైరెక్ట్‌గా నామినేట్ కాగా,  అమ్మా రాజశేఖర్ అర గుండుకొట్టించుకునా సేవ్ అయ్యాడు. దీంతో ప‌న్నెండు మంది ఇంటి స‌భ్యుల‌లో ప‌దిమంది నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో పాల్గొన్నారు.

జంట‌లుగా ఏర్ప‌డిన హౌజ్‌మేట్స్‌లో ఒక్క స‌భ్యుడునామినేట్ కాగా, మ‌రో స‌భ్యుడు సేవ్ అయ్యారు. ఐదు జంట‌ల‌లో నాలుగు జంటల మధ్య చర్చ తొందరగానే కొలిక్కి వచ్చినప్పటికీ అరియానా-మెహబూబ్‌లు మాత్రం పోటా పోటీగా వాద‌న‌లు జ‌రిపారు. కాయిన్స్ టాస్క్, రోబో టాస్క్ తో పాటు ప‌లు నామినేష‌న్ల విష‌యం వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌కు రాగా చివ‌ర‌కు అరియానా తాను నామినేట్ అవుతున్నా అని పేర్కొంది.  అంతేకాదు త‌న‌కు మెహబూబ్ హెల్ప్ అవసరం లేదని చెప్పింది.

అయితే అరియానా ఎంతో ఓపిక‌తో మెహ‌బూబ్‌తో పోరాడిన విష‌యంలో ఆమెని హౌజ్‌మేట్స్ ప్ర‌శంసించారు. నువ్వు మాట్లాడిన ప్ర‌తి పాయింట్ వాలిడ్ పాయింటే అంటూ సోహైల్ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు మెహ‌బూబ్ ద‌గ్గ‌ర ఆమె నీకోసం చాలా చేసిందని అన్నాడు. అరియానా తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఆమె లెవ‌ల్ మ‌రింత పెరిగింద‌ని సోహైల్ అన్నాడు.  మోహబూబ్‌ త్యాగం చేస్తే తన రేంజ్‌ ఓ లెవల్లో పెరిగిపోయేదని అంతా గుసగుసలాడారు . సోహైల్‌ అయితే అరియానా మీద మరింత రెస్పెక్ట్‌ పెరిగిందని ప‌దేప‌దే చెప్పుకొచ్చారు. 

మ‌రోవైపు హారిక  నామినేషన్స్ అనంతరం అమ్మా రాజశేఖర్‌తో నామినేషన్స్ విషయంపై చ‌ర్చించింది.  అభిజిత్ నా కోసం త్యాగం చేశాడు కాబట్టి.. తనకి హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి.. లేదంటే బిగ్ బాస్ అన్ ఫెయిర్’ అంటూ చెప్పుకొచ్చింది. గ‌త వారాల‌కు భిన్నంగా ఈ సారి నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌గా ఏడో వారంలో  మోనాల్‌, అవినాష్‌, అభిజిత్‌, దివి, అరియానా, నోయల్‌ ఎలిమినేషన్‌లో ఉన్నారు.  వీరిలో ఎవ‌రు ఈ హౌజ్‌ను వీడ‌నున్నారో తెలియాలంటే వారం రోజులు ఆగాల్సిందే.