e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News తండ్రైన హీరో.. కొడుకు పేరు కూడా రివీల్‌

తండ్రైన హీరో.. కొడుకు పేరు కూడా రివీల్‌

త‌మిళ హీరోలు కూడా ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ని బాగానే అల‌రిస్తున్నారు. చేస్తున్న ప్ర‌తి సినిమాను త‌మిళంతో పాటు తెలుగులోను విడుద‌ల చేస్తున్న నేప‌థ్యంలో ఆ హీరోల‌కి మ‌న టాలీవుడ్ ప్రేక్ష‌కులు కూడా అభిమానులుగా మారుతున్నారు. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా శివకార్తికేయన్ సుపరిచితులు.

తెలుగులో శివకార్తికేయన్ నటించిన కొన్ని సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ డైరెక్ట్ తెలుగు సినిమాలో మాత్రం న‌టించ‌లేదు. అయితే ఈ యంగ్ హీరో ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహించనున్న సినిమాతో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రానుంది అంటున్నారు. ఈ సినిమాని హిందీ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారట. అలాగే ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఎంతో టాలెంట్ ఉన్న శివ కార్తికేయ‌న్ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. రీసెంట్‌గా అత‌ని భార్య కొడుకుకి జ‌న్మ‌నివ్వ‌గా ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. అంతేకాకుండా త‌న కుమారుడికి గుగ‌న్ దాస్ అనే పేరు పెట్టిన‌ట్టు కూడా తెలియ‌జేశాడు.శివ కార్తికేయ‌న్ తండ్రి పేరు దాస్ కాగా, ఆయ‌న పేరు కూడా క‌లిసి వ‌చ్చేలా కొడుకుకి పేరు పెట్ట‌కున్నాడు. ఇప్ప‌టికే వీరికి ఆరాధ‌న అనే కూతురు ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana