శనివారం 29 ఫిబ్రవరి 2020
డాంగ్ డాంగ్ సాంగ్‌కి స్టెప్పులేసిన సితార‌.. ఫిదా అయిన తమ‌న్నా

డాంగ్ డాంగ్ సాంగ్‌కి స్టెప్పులేసిన సితార‌.. ఫిదా అయిన తమ‌న్నా

Feb 14, 2020 , 13:32:43
PRINT
డాంగ్ డాంగ్ సాంగ్‌కి స్టెప్పులేసిన సితార‌.. ఫిదా అయిన తమ‌న్నా

వెండితెర ఎంట్రీ ఇవ్వ‌కుండానే సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన చిన్నారి సితార‌. మ‌హేష్ త‌న‌య నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. మ‌హేష్ లేదా న‌మ్ర‌త అడ‌పాద‌డపా సితార డ్యాన్స్ లేదా ఇంట‌ర్వ్యూల‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఫుల్ థ్రిల్‌ని క‌లిగిస్తున్నారు. ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న తండ్రి మ‌హేష్‌ని ఇంట‌ర్వ్యూ  చేసిన సితార తాజాగా డాంగ్ డాంగ్ సాంగ్‌కి స్టెప్పులు వేసి అల‌రించింది. మ‌హేష్‌, త‌మ‌న్నా వేసిన స్టెప్పులు మాదిరిగానే స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం సితార డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో త‌మ‌న్నా కూడా స్పందించింది. ఈ వీడియోకి  సో క్యూట్ అనే కామెంట్ కామెంట్ పెట్టింది. ఇక వెకేష‌న్‌లో భాగంగా ఫ్యామిలీతో న్యూ యార్క్‌కి వెళ్లిన మ‌హేష్ మే నెల‌లో హైద‌రాబాద్‌కి రానున్న‌ట్టు తెలుస్తుంది. ఆ త‌ర్వాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు .logo