గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 13:53:58

ఔట్‌డోర్ అడ్వెంచ‌ర్స్ మిస్ అవుతున్నా: సితార‌

ఔట్‌డోర్ అడ్వెంచ‌ర్స్ మిస్ అవుతున్నా:  సితార‌

మ‌హేష్ గారాల ప‌ట్టి సితార నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. ఈ లిటిల్ ప్రిన్స్‌కి సంబంధించిన ఏ ఫోటో అయిన‌, వీడియో అయిన‌ కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్ అవుతుంటుంది. ముద్దు ముద్దుగా మాట్లాడ‌డం, తండ్రి సినిమాకి సంబంధించి పాట‌లు పాడ‌డం లేదంటే డ్యాన్స్‌లు చేస్తూ సితార తెగ అల‌రిస్తూ ఉంటుంది. తాజాగా సితార త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేస్తూ.. ఔట్ డోర్ అడ్వెంచ‌ర్స్ మిస్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది.

క‌రోనా కార‌ణంగా మ‌హేష్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీ ఇంటికే ప‌రిమిత‌మైంది. ఇంట్లోనే అడ్వెంచ‌ర్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తూ వ‌స్తున్నారు. సితార ఏ అండ్ ఎస్ పేరుతో యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి దాని ద్వారా అనేక విష‌యాల‌ని నెటిజ‌న్స్‌కి తెలియ‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే. 
logo