బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 11:19:11

మ‌హేష్‌కి హెడ్ మ‌సాజ్ చేసిన సితార‌

మ‌హేష్‌కి హెడ్ మ‌సాజ్ చేసిన సితార‌

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికి ప‌రిమిత‌మైన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క్వారంటైన్ స‌మయాన్ని త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు. ఒక‌వైపు చిన్న‌పిల్లాడిలా మారి వారితో  గేమ్స్ ఆడ‌డం, మ‌రోవైపు ఇంట్లో ర‌చ్చ ర‌చ్చ చేయ‌డాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌కి తెలియ‌జేస్తుంది.

తాజాగా మ‌హేష్ త‌న కూతురు సితార‌తో హెడ్ మాలిష్ చేయించుకుంటున్న ఫోట్ షేర్ చేస్తూ.. గౌత‌మ్ త‌న గేమ్ తాను ఆడ‌కుంటుండ‌గా, మ‌హేష్ హెడ్ మ‌సాజ్ వాలంటీర్ అయ్యాడ‌ని పేర్కొంది. 2 నిమిషాల‌లో మసాజ్‌ని సితార పూర్తి చేయ‌గా, ఇదే చివ‌రిసార‌ని మ‌హేష్ పేర్కొన్న‌ట్టు న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ బాబు రానున్న రోజుల‌లో వ‌రుస ప్రాజెక్ట్‌లు చేయ‌నున్నాడు.


logo