శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 27, 2020 , 11:42:48

గోల్డెన్ రూల్స్.. సితార చెప్పేవి పాటించండి: మ‌హేష్‌

గోల్డెన్ రూల్స్.. సితార చెప్పేవి పాటించండి: మ‌హేష్‌

మ‌హేష్ గారాల ప‌ట్టి  సితార నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. ఏదో ఒక వీడియో ద్వారా సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యే మ‌హేష్ కూతురు సితార తాజాగా క‌రోనాపై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేసింది. ముందుగా   ద‌గ్గు, జ్వ‌రం, శ్వాస తీసుకోలేక‌పోవ‌డం వంటివి క‌రోనా ల‌క్ష‌ణాలుగా చెబుతూ, ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాల‌ని కోరింది. ఆ త‌ర్వాత 5 సూత్రాలు త‌ప్ప‌క పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది.

మొద‌టి సూత్రం ప్ర‌కారం ఇంట్లో ఉండి, సామాజిక దూరం త‌ప్ప‌క పాటించాలి. రెండోది చేతుల‌ని 30 సెక‌న్ల పాటు త‌ర‌చు శుభ్ర‌ప‌ర‌చుకోవాలి. మూడోది ద‌గ్గు, లేదా తుమ్ములు వ‌చ్చిన‌ప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. నాలుగోది మీ చుట్టు ప‌క్క‌ల వారికి మూడు మీట‌ర్ల దూరం త‌ప్ప‌క పాటించాలి. ఐద‌వ‌ది మీ చేతితో క‌న్ను, నోరు, చెవుల‌ని తాక‌రాదు. ఇంట్లో ఉండండి. క‌రోనాని త‌రిమి కొట్టండ‌ని సితార వీడియో ద్వారా తెలియ‌జేసింది. ఈ వీడియోని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. గోల్డెన్ రూల్స్‌, పిల్ల‌లు చెప్పిన మాట‌లు వినండ‌ని కామెంట్ పెట్టారు.logo