గురువారం 28 మే 2020
Cinema - May 03, 2020 , 08:10:24

మ్యూజిక్‌కి త‌గ్గ‌ట్టు స్టెప్పులేసిన సితార‌

మ్యూజిక్‌కి త‌గ్గ‌ట్టు స్టెప్పులేసిన సితార‌

మ‌హేష్ గారాల ప‌ట్టి సితార చిన్న వ‌య‌స్సులోనే సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందింది. ఆమెకి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేసిన కొద్ది సేప‌టికే ఫుల్ వైర‌ల్‌గా మార‌తాయి. తాజాగా న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సితార డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఓ ఫంక్ష‌న్‌లో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి సంగీతానికి త‌గ్గ‌ట్టు డ్యాన్స్ చేస్తుంది సితార అని కామెంట్ పెట్టింది. వీడియోలో సితార చేసే డ్యాన్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. గ‌తంలోను సితార త‌న తండ్రి సినిమాలలోని పాట‌లకి స్టెప్పులేస్తూ ఫ్యాన్స్‌కి ఫుల్ థ్రిల్ క‌లిగించిన విష‌యం తెలిసిందే. logo