ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 10:07:32

త‌న‌కిష్ట‌మైన సాంగ్‌కి చిందేసిన సితార‌

త‌న‌కిష్ట‌మైన సాంగ్‌కి చిందేసిన సితార‌

మ‌హేష్ బాబు గారాల‌ప‌ట్టి సితార నెటిజ‌న్స్‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తుంది. డ్యాన్స్ చేయ‌డ లేదా పాట‌లు ప‌డ‌డం, ఖాళీ దొరికితే త‌న తండ్రితో క‌లిసి వినోదం పంచ‌డం వంటివి చేస్తుంది. తాజాగా సితార త‌న‌కిష్ట‌మైన ఇంగ్లీష్ సాంగ్‌కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సంతోషంగా ఉండండి.. ఇది నా ఫేవ‌రేట్ సాంగ్ అంటూ కామెంట్ పెట్టింది.

సితార డ్యాన్స్‌కి మ‌హేష్ అభిమానుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది.  గ‌తంలో  సితార‌ 'మ‌హ‌ర్షి'లో నుంచి పాల‌పిట్ట పాట‌కు, స‌రిలేరు నీకెవ్వ‌రులో 'డాంగ్ డాంగ్' పాట‌కు స్టెప్పులేసిన విష‌యం తెలిసిందే.  క‌రోనా వ‌ల‌న ఇటు స్కూల్స్ బంద్ అయ్యాయి. షూటింగ్స్ జ‌ర‌గ‌డం లేదు. దీంతో తండ్రి కూతుళ్లు త‌మ‌కి దొరికిన ఈ విలువైన స‌మయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రోవైపు మ‌హేశ్ ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నాడు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.
logo