విక్టరీ వెంకటేష్, అందాల నటి ప్రియమణి ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం నారప్ప. ఈ సినిమాతో కొత్త యాంగిల్‌ని చూపించారు వెంకటేష్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన నారప్ప సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. నారప్ప కొడుకు శీనప్ప అనే పాత్రకి కూడా మంచి ఆదరణ లభించింది. తాజాగా శీనప్ప సన్నివేశాలకు సంబంధించి మేకర్స్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది.
నారప్ప చిత్రంలో శీనప్పగా నటించిన చైల్డ్ యాక్టర్ పేరు గీతా కృష్ణ. అతడి స్వస్థలం రాజమండ్రి. గీతాకృష్ణ అన్నయ్య ఇండస్ట్రీలో కాస్టింగ్ మేనేజర్. అతని సాయంతో సినిమాల ఆడిషన్స్ కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వస్తుండేవాడు. రామానాయుడు స్టూడియోస్ లో నారప్ప సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి హైదరాబాద్ కు వచ్చాడు. గీతా కృష్ణ ఆడిషన్స్ కు వచ్చే ముందే ఇద్దరిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు. కానీ ఫైనల్ గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గీతాకృష్ణనే ఎంపిక చేశారు.
శీనప్ప క్యారెక్టర్ కోసం చైల్డ్ ఆర్టిస్టును వెతికే టైంలో ఓ యూట్యూబ్ ఛానల్ వచ్చిన షార్ట్ ఫిలింలో అతన్ని చూశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సురేశ్ బాబు, దర్శకుడు ఓ సారి అతన్ని పిలిపించగా, రాజమండ్రి నుంచి వచ్చాడు. ఆడిషన్స్ కు పిలిపించి ఆ పాత్రకు ఇతడైతేనే కరెక్ట్ సెట్ అవుతాడని ఫైనల్ చేసినట్టు చెప్పాడు శ్రీకాంత్ అడ్డాల.