శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 13:35:55

క‌రోనా ఎఫెక్ట్‌..ఐదు థియేట‌ర్ల క‌థ స‌మాప్తం!

క‌రోనా ఎఫెక్ట్‌..ఐదు థియేట‌ర్ల క‌థ స‌మాప్తం!

క‌రోనా ఎఫెక్ట్‌తో చాలా రంగాల ప‌రిస్థితి దుర్భ‌రంగా మారింది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది.దాదాపు ఏడు నెల‌లు సినిమా షూటింగ్‌లు లేక‌పోవ‌డం, థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డంతో ఇండ‌స్ట్రీ పూర్తిగా స్తంభించింది. ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల ప్ర‌కారం కొద్ది రోజులుగా షూటింగ్స్ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, థియేట‌ర్స్ మాత్రం తెరిచే ప‌రిస్థితి లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో కరోనా నిబంధ‌న‌లు పాటిస్తూ థియేట‌ర్స్ ర‌న్ చేయ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌ని భావిస్తున్నాయి యాజ‌మాన్యాలు. ఈ నేప‌థ్యంలో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ యాజ‌మాన్యాలు వాటిని శాశ్వ‌తంగా మూసేయాల‌ని భావిస్తున్నారు. 

హైద‌రాబాద్‌లో ఒక‌ప్పుడు అభిమానుల హ‌డావిడికి అడ్డాగా మారిన సింగిల్ స్క్రీన్ థియేట‌ర్స్ ... గెలాక్సీ థియేటర్‌(టోలిచౌకి), శ్రీ రామ థియేటర్(బహదూర్‌పుర), అంబ థియేటర్‌(మెహదీపట్నం), శ్రీమయూరి థియేటర్‌(ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌), శాంతి థియేటర్‌(నారాయణగూడ) ఇవి ఐదు మూత‌ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం మ‌ల్లీ ప్లెక్స్‌ల‌కు జ‌నాలు ఎక్కువ‌గా వెళుతున్న నేప‌థ్యంలో వాటిని తొలగించి గోడౌన్స్ లేదంటే ఫంక్ష‌న్ హాల్స్‌గా మార్చాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారట‌. ఇదే నిజ‌మైతే ద‌శాబ్దాల చ‌రిత్ర కలిగిన ఈ థియేట‌ర్స్  క‌రోనా వ‌ల‌న శాశ్వ‌తంగా మూత‌ప‌డ‌డం క‌ల‌వ‌ర‌ప‌రిచే విష‌య‌మే మ‌రి. 


logo