శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 19:14:12

సింగర్ సునీత-రామ్ వీరపనేని వెడ్డింగ్ టీజర్ విడుదల

సింగర్ సునీత-రామ్ వీరపనేని వెడ్డింగ్ టీజర్ విడుదల

టాలీవుడ్ సింగర్ సునీత, మ్యాంగో రామ్ వివాహం ఈ మధ్యే ఘనంగా జరిగింది. జనవరి 9న ఈ పెళ్లి జరిగింది. శంషాబాద్ లోని రామాలయంలో సునీత, రామ్ పెళ్లి జరిగింది. కొన్నేళ్ళ పాటు ఒంటరిగానే ఉన్న సునీత.. చాలా సంవత్సరాల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ కొత్త జీవితం చాలా ఆనందంగా ఉందనేది ఈమె పెళ్లి సమయంలోనే మొహం చూస్తేనే అర్థమైపోయింది. ఈ ఇద్దరి పెళ్లి చాలా ఘనంగా జరగడమే కాదు.. ఎంతోమంది అతిథులు కూడా వచ్చారు. గిఫ్టులు కూడా చాలానే వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సునీత, రామ్ పెళ్లి వీడియోకు సంబంధించిన టీజర్ బయటికి వచ్చింది. తన యూ ట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది సునీత. ఈమె రెండో పెళ్లిపై ముందు నుంచి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి.. మరికొన్ని సమర్థింపులు కూడా వచ్చాయి.


ఇప్పుడు పెళ్లేంటి అని ప్రశ్నించేవాళ్ల కన్నా కూడా చేసుకుంటే తప్పేంటి అని సునీతను సపోర్ట్ చేసిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే కేవలం 19 ఏళ్ళకే పెళ్లి చేసుకుని.. కొన్నేళ్ళ తర్వాత మొదటి భర్త తీరుతో విడిపోయి గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత.. ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన వెడ్డింగ్ టీజర్ లో చాలా అందమైన జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటి దగ్గర నిశ్చితార్థం జరిగిన రోజు నుంచి పెళ్లి మంటపంలో పెళ్లి కూతురును చేసే వరకు అన్ని ఈ మూడు నిమిషాల టీజర్ లో చూపించింది సునీత. పెళ్లికి సంబంధించిన వీడియోను కూడా త్వరలోనే విడుదల చేయనుంది ఈమె. ఇందులో సుమ కనకాల డాన్సులు చేయడం హైలైట్. 

దాదాపు పాతికేళ్లుగా సునీత, సుమ స్నేహితులు. ఈమె పెళ్ళికి కూడా కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చింది సుమ. ఆమెతో పాటు నితిన్ కూడా భారీ బహుమతే ఇచ్చాడు. అన్నీ కలిపితే సునీత పెళ్లికి దాదాపు 1.5 కోట్ల వరకు గిఫ్టులు వచ్చినట్లు తెలుస్తుంది. జనవరి 9న శంషాబాద్ సమీపంలో అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో జరిగింది. ఏదేమైనా ఇప్పుడు పెళ్లి వీడియో టీజర్ చూస్తుంటే అదరహో అనిపిస్తుందంతే. పెళ్లి తర్వాత తన పనుల్లో తాను బిజీ అయిపోయింది సునీత. కెరీర్ లో ఈ మధ్య తక్కువ పాటలే పాడుతుంది సునీత. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో ఈమె పాడిన నీలినీలి ఆకాశం పాట చరిత్ర సృష్టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo