మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 17:54:14

ఎస్పీ బాలుకు మళ్లీ అస్వస్థత

ఎస్పీ బాలుకు మళ్లీ అస్వస్థత

చెన్నై: ప్రముఖ గాయకుడు  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు.  ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని  ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  బాలుకు కరోనా సోకడంతో  సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.  పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. 

ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాసేపట్లో బాలు ఆరోగ్య పరిస్థితిపై   డాక్టర్లు హెల్త్‌బులెటిన్‌  విడుదల చేయనున్నారు. ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో దవాఖానలో చేరగా, చికిత్స అనంతరం ఆరోగ్యం కొంత మెరుగైంది. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. 
logo