మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 20:03:28

నిల‌క‌డ‌గానే ఎస్పీ బాలు ఆరోగ్యం!

నిల‌క‌డ‌గానే ఎస్పీ బాలు ఆరోగ్యం!

చెన్నై: ఇటీవ‌ల క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని వైద్యులు తెలిపారు. సోమ‌వారం ఆయ‌న‌కు మ‌రోసారి కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా నెగెటివ్ వ‌చ్చింది. అయితే ఇన్నాళ్ల‌ అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న బాగా నీర‌సించిపోయార‌ని, అందుకే చికిత్స అందిస్తున్నామ‌ని ఎంజీఎం ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు చెప్పారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. 

ప్ర‌స్తుతం బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేట‌ర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్‌ తీసేయాలని వైద్యులు భావిస్తున్న‌ట్లు ఎస్పీ బాలు త‌న‌యుడు చ‌ర‌ణ్ చెప్పారు.   

క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరారు. ఆ తర్వాత కొన్నిరోజులకే పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత ఆయనకు ఎక్మో సాయం అందిస్తూ వచ్చారు. దాంతో ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల ప‌నితీరు కూడా మెరుగుపడినట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo