గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 13:56:02

సొంతింటిని కంచి పీఠానికి విరాళంగా ఇచ్చిన బాలు

సొంతింటిని కంచి పీఠానికి విరాళంగా ఇచ్చిన బాలు

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్య‌ణ్యం ఈ ఏడాది  ఫిబ్ర‌వ‌రిలో త‌న  సొంతింటిని కంచి పీఠానికి విరాళంగా ఇచ్చారు. త‌న తండ్రి శైవ భ‌క్తులు కాగా, ఎంతో గుర్తు భ‌క్తితో ఉండేవారని బాలు చెప్పారు. వారు లేర‌నే అసంతృప్తి తప్ప వారి పేరుతో వేద పాఠశాలను నిర్వహించటం ద్వారా వారు ఇక్కడే ఉన్నారని భావిస్తాం. కంచి పీఠానికి నేను గృహాన్ని అప్పగించలేదు.. భగవత్‌ సేవకు స్వామివారే తీసుకున్నారనేది సబబు అన‌డం బాగుంటుంది అని బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆ సంద‌ర్భంలో పేర్కొన్నారు. 

కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామికి గృహాన్ని లాంఛనంగా సమర్పించిన  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి ఎస్పీ సాంబమూర్తి పేరిట ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. వేద పాఠశాల నిర్వహణకు తన సొంత ఇంటిని విరాళంగా ఇచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ధ‌ర్మ ర‌క్ష‌కుడు అని అప్ప‌ట్లో నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపించారు.

కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి మాట్లాడుతూ.. ‘‘భిక్షాటన పూర్వకంగా త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించిన ఘనత ఎస్పీ సాంబమూర్తికే దక్కుతుంది. నెల్లూరు వీధుల్లో భగవన్నామ సంకీర్తనను మారుమోగించిన ప్రతిభాశాలి సాంబమూర్తి. దేశంలో వేదాన్ని, శాస్త్రాన్ని, పురాణాలను, సంగీత, సాహిత్యాలను పరిరక్షించుకునే ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. సంగీతం, భక్తి ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి సాంబమూర్తి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ స్థలంలో వేదనాద ప్రచారాన్ని కొనసాగిస్తాం’’ అని చెప్పారు. 


logo