మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 01:52:51

నేను క్షేమంగా ఉన్నా గాయని జానకి

నేను క్షేమంగా ఉన్నా గాయని జానకి

తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు ప్రముఖ గాయని ఎస్‌.జానకి. తన మరణంపై వస్తోన్న వదంతుల్ని నమ్మవద్దని చెప్పింది. జానకి కన్నుమూసిందంటూ సోషల్‌మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ  అసత్య వార్తలపై జానకి ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఇలాంటి అబద్ధాల్ని నమ్మొద్దని కోరారు. చాలా మంది అభిమానులు తనకు ఫోన్‌ చేసి ఆవేదనకు గురయ్యారని, కన్నీళ్లు పెట్టుకున్నారని జానకి తెలిపింది. ఇలాంటి వార్తల్ని ప్రచారం చేయడం తగదని, ఏదైనా వివరంగా తెలుసుకుంటేనే బాగుంటుందని  హితవు పలికింది. జానకి మరణించారంటూ వచ్చిన వార్తలపై  ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. కొంతమంది విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ నిరాధారమైన వార్తల్ని ప్రచారం చేస్తున్నారన్నారు.


logo