బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 03, 2020 , 19:15:37

అపార్టుమెంట్స్ మధ్యలో పాటల ప్రదర్శన..వీడియో

అపార్టుమెంట్స్ మధ్యలో పాటల ప్రదర్శన..వీడియో

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అన్ని రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు జారీ చేస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ..కరోనా బారిన పడుతున్నారు.

కరోనాపై పోరాటం చేసేందుకు అందరూ సహకరించాలని, కరోనా నుంచి రక్షించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తూ అహ్మదాబాద్‌లో గాయకులతో పాటల ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వస్త్రపూర్‌ పోలీసులు అపార్టుమెంట్స్ మధ్యలో క్రేన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అపార్టుమెంట్స్ వాసులంతా బయటకు పై నుంచి ఆ పాటలను వింటూ ఎంజాయ్ చేశారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo