బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 12:34:29

ప్ర‌ముఖ సింగ‌ర్‌కు క‌రోనా.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు

ప్ర‌ముఖ సింగ‌ర్‌కు క‌రోనా.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు

క‌రోనా మ‌హ‌మ్మారి సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు సింగ‌ర్స్ క‌రోనా బారిన పడి అనేక ఇబ్బందులు ప‌డ్డారు. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ సింగ‌ర్ కుమార్ స‌నుకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ఆయన అభిమానులలో ఆందోళ‌న నెల‌కొంది. అభిమానులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు కుమార్ స‌ను త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ద‌న‌లు చేస్తున్నారు. 

కుమార్ స‌ను స్వ‌యంగా త‌న‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ‘దురదృష్టవశాత్తు సనుడా కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దయచేసి నా ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థించండి. థ్యాంక్యూ మై టీమ్‌’ అంటూ పోస్ట్‌ చేశారు.  కుమార్‌ సాను 1990లో బాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాట‌ల‌కు త‌న గానాన్ని అందించారు . బీబీసీ టాప్‌ 40 బాలీవుడ్‌ సౌండ్‌ట్రాక్స్‌లో కుమార్‌ పాటలు దాదాపు 25 ఉన్నాయి. అతను 30 భాషల్లో  21 వేల పాటలను పాడి రికార్డు సృష్టించారు. అంతేగాక కేవలం ఒకే రోజులో 28 పాటలు పాడి గిన్నిస్‌ బుక్‌  ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. ప్రస్తుతం కుమార్‌ సాను కుమారుడు జాన్‌ బిగ్‌బాస్‌ 14లో కంటెస్టెంటుగా ఉన్నారు. 2009లో పద్మ శ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. సనూకు భార్య సలోని, కూతుళ్లు షానూన్‌, అన్నాబెల్‌ ఉన్నారు.


logo