మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 13:14:20

ప్ర‌ముఖ సింగ‌ర్‌ అనురాధ పౌడ్వాల్ ఇంట‌ విషాదం!

ప్ర‌ముఖ సింగ‌ర్‌ అనురాధ పౌడ్వాల్ ఇంట‌ విషాదం!

ప్ర‌ముఖ ప్లేబ్యాక్ సింగ‌ర్, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత అనురాధ పౌడ్వాల్ ఇంట విషాదం చోటు చేసుకున్న‌ది. అనురాధ కుమారుడు ఆదిత్య పౌడ్వాల్ శ‌నివారం ఉద‌యం క‌న్నుమూశారు. 33 ఏండ్ల వ‌య‌సులోనే ఆదిత్య మూత్ర‌పిండాల వ్యాధికి గుర‌య్యారు. గ‌త కొన్ని నెల‌లుగా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. మూత్ర‌పిండాలు ఫెయిల్ కావ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం.

ఆదిత్య పౌడ్వాల్ మ్యూజిక్ అరేంజ‌ర్‌. అంతేకాదు నిర్మాత కూడా. ఇత‌ను అనేక‌మంది బాలీవుడ్ సంగీత స్వ‌ర‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప‌నిచేశారు. ఆదిత్య మ‌ర‌ణం ప‌ట్ల గాయ‌కులు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, అదితి సింగ్ సోష‌ల్ మీడియాలో సంతాపం తెలిపారు. మా ప్రియ‌మైన ఆదిత్య పౌడ్వాల్ ఇక లేరు అని మ‌హ‌దేవ‌న్‌ ట్వీట‌ర్ చేశారు.  


logo