బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 12:11:49

కరోనాతో మ‌రో గాయ‌కుడు మృతి

కరోనాతో మ‌రో గాయ‌కుడు మృతి

క‌రోనా మ‌హ‌మ్మారికి చిన్న పెద్ద అనే భేదం లేకుండా అజాగ్ర‌త్త‌గా ఉన్న వారిని కాటేస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు మృత్యువాత ప‌డ‌గా తాజాగా ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, గాయ‌కుడు,  గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత ఆడమ్‌ ష్లెసింగర్‌(52) క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణించిన విష‌యాన్ని టామ్ హంక్స్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ‘ఆడమ్‌ ష్లెసింగర్‌ లేకుండా ప్లేటోన్‌ ఉండదు. అతడు కోవిడ్‌-19 చేతిలో ఓడిపోయాడు. ఇది విచారకర రోజు’అంటూ త‌న ట్వీట్‌లో తెలిపాడు. ఆడ‌మ్ మృతికి ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

పాప్‌ రాక్‌బాండ్‌ ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ సహ వ్యవస్థాపకుడుగా ఉన్న ఆడమ్‌ ష్లెసింగర్ 1995లో న్యూయార్క్‌లో ఫౌంటైన్స్‌ ఆఫ్‌ వేన్‌ అనే రాక్‌ బ్యాండ్‌ను స్థాపించారు. ఇక హాంక్స్ చిత్రం ద‌ట్ ధింగ్ యుడు అనే చిత్రానికి పాట‌ల ర‌చ‌యిత‌గా ప‌ని  చేయ‌గా, ఈ చిత్రానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్నారు. 2009 లో ‘ఎ కోల్బర్ట్‌ క్రిస్మస్‌’కి ఆడమ్‌ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo