శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 15, 2020 , 11:18:50

ఈ సారి బుట్ట‌బొమ్మ సాంగ్‌కి సిమ్రాన్ స్టెప్పులు

ఈ సారి బుట్ట‌బొమ్మ సాంగ్‌కి సిమ్రాన్ స్టెప్పులు

అల్లు అర్జున్ , పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. ఈ చిత్రం కోసం థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గా అల‌రించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా  ‘బుట్ట బొమ్మ’ అంటూ అర్మాన్‌ మాలిక్ పాడిన పాట దేశ విదేశాల‌లో ఫ్యాన్స్‌కి మాంచి థ్రిల్‌ని క‌లిగిస్తుంది. ‌ ఫిలిప్పీన్స్‌లో కొంద‌రు సినీ ల‌వ‌ర్స్ బుట్ట‌బొమ్మ సాంగ్‌కి గ్రూప్ డ్యాన్స్ చేశారు. శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయ‌డం మ‌నం చూశాం.  ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్.. త‌న భార్య క్యాండిస్‌తో క‌లిసి బుట్ట బొమ్మ సాంగ్‌కి త‌న దైన శైలిలో స్టెప్పులు వేసి అల‌రించాడు.

తాజాగా ఒక‌ప్ప‌టి సీనియర్ న‌టి సిమ్ర‌న్ .. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న నేప‌థ్యంలో  'బుట్టబొమ్మ' పాటపై డాన్స్ చేసి మురిపించింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో వైరల్ అయింది. సిమ్రాన్ స్టెప్స్ చూసి సూప‌ర్బ్ అని  అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవ‌ల కొడుకుతో క‌లిసి డ్యాన్స్ చేసిన సిమ్రాన్  వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఒక డైలాగ్‌ను డ్యాన్స్‌గా కంపోజ్ చేశారు అమ్మాకొడుకులు.  


logo