బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Aug 23, 2020 , 21:57:09

సాదాసీదాగా బాలీవుడ్‌ బ్యూటీ వాణీకపూర్‌ జన్మదినం

సాదాసీదాగా బాలీవుడ్‌ బ్యూటీ వాణీకపూర్‌ జన్మదినం

న్యూ ఢిల్లీ: బాలీవుడ్‌ బ్యూటీ వాణీకపూర్‌ ఆదివారం తన 32 వ జన్మదినాన్ని సాదాసీదాగా జరుపుకున్నది. ఈ ‘వార్‌’ హీరోయిన్‌ ఇప్పుడు రెండు బ్యాక్‌టుబ్యాక్‌ చిత్రాల్లో నటించేందుకు సంతకం చేసి, మంచి జోరుమీదున్నది. అక్షయ్ కుమార్ సరసన 'బెల్ బాటమ్', ఆయుష్మాన్ ఖుర్రానాతో ఓ ప్రేమకథలో నటిస్తోంది. 

‘కొవిడ్‌-19 వల్ల మనదేశంలో సున్నితమైన సమయం నడస్తోంది. కాబట్టి, ఈ సంవత్సరం నా పుట్టినరోజున నేను ఎలాంటి ఆర్బాటాలు లేకుండా, సాదాసీగా జరుపుకున్నాను. కొన్ని ప్రణాళికలు పక్కాగా అమలు చేసేందుకు నేను కచ్చితంగా ఇష్టపడతాను.’ అని వాణీకపూర్‌ పేర్కొంది. సెప్టెంబర్‌‌, అక్టోబర్‌లలో తన రెండు చిత్రాల షూటింగ్‌లు ప్రారంభం కాబోతున్నాయని తెలిపింది. అప్పటిదాకా అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటానని తెలిపింది. కాగా, ఆమెకు బాలీవుడ్‌ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo