గురువారం 28 మే 2020
Cinema - Apr 30, 2020 , 09:31:31

ప‌దేళ్ళు పూర్తి చేసుకున్న '‌సింహా'

ప‌దేళ్ళు పూర్తి చేసుకున్న '‌సింహా'

బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం సింహా. ఏప్రిల్ 30, 2010లో విడుద‌లైన ఈ చిత్రం నేటితో ప‌దేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా బాల‌య్య అభిమానులు సోష‌ల్ మీడియాలో సింహా హంగామా మొద‌లు పెట్టేశారు. సింహా చిత్రానికి సంబంధించిన‌ పోస్ట్‌లు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్.. ‘‘సింహా’ చిత్రంలో న‌య‌న‌తార‌, న‌మిత‌, స్నేహా ఉల్లాల్ ముఖ్య పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే.

సింహా చిత్రంలో నంద‌మూరి బాల‌కృష్ణ వైద్యుని పాత్ర‌లో న‌టించి త‌న అభిమానులకి కావ‌ల‌సినంత వినోదాన్ని అందించారు. ఆయ‌న రౌద్రం ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడు థియేట‌ర్ అల్ల‌ర్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. సినిమా మొత్తం ఎన్నో భావోద్వేగాల‌తో న‌డ‌వ‌గా, ఇందులో బాల‌య్య చూపించిన న‌ట విన్యాసం అద్భుతం. సింహా చిత్రం అభిమానుల‌కి మాత్రం ఆరు సంవ‌త్స‌రాల క‌రువుని తీర్చింది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ .. బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతుండగా, ఇందులో అఘోరాగా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. 


logo